Lahari
రచయిత
డెలివరీ బాయ్‌గా నటించి మహిళపై అత్యాచారం – పుణెలో దారుణం
Lahari
రచయిత
డెలివరీ బాయ్‌గా నటించి మహిళపై అత్యాచారం – పుణెలో దారుణం

మహారాష్ట్ర పుణెలో ఓ మహిళపై దారుణ ఘటన చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌గా వచ్చి, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఓటీపీ కోసం లోపలికి వెళ్లిన మహిళను అనుసరించి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫోన్‌లో సెల్ఫీ తీసుకుని, మళ్లీ వస్తానంటూ బెదిరించి పరారయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాధితురాలు అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు వచ్చాడు. అతడు ఓటీపీ అడుగుతూ ఆమెను లోపలికి పంపి, ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలు సుమారు గంట సేపు స్పృహ తప్పినట్టుగా ఉన్నట్లు సమాచారం. మెలకువ వచ్చిన తర్వాత తన బంధువులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులను ఇంట్లోకి అనుమతించవద్దని పోలీసులు హెచ్చరించారు.