R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రియల్టర్ల వివాదం దారుణ హత్యలకు దారితీసింది
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రియల్టర్ల వివాదం దారుణ హత్యలకు దారితీసింది

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో తండ్రి-కుమారుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరుకు చెందిన వీరాస్వామిరెడ్డి (62), ఆయన కుమారుడు ప్రసాద్‌రెడ్డి (37) నిన్న కోర్టు పనితో నరసరావుపేటకు వచ్చారు. బుధవారం ఉదయం కోర్టుకు వెళ్లే సమయంలో ఇద్దరిని గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వీరిద్దరినీ పాతమాగులూరులోని రియల్ ఎస్టేట్ వెంచర్‌కి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన విభేదాలే ఈ ఘటనకు దారితీశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు అయిన మాధవరెడ్డి పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news