A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రికార్డు రాకపోకలు: రోజుకు 90 వేల ప్రయాణికులు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రికార్డు రాకపోకలు: రోజుకు 90 వేల ప్రయాణికులు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రికార్డు రాకపోకలు: రోజుకు 90 వేల ప్రయాణికులు

హైదరాబాద్ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వినూత్న రికార్డులు నమోదు చేస్తోంది. అత్యంత వేగంగా సేవలందించే ఎయిర్‌పోర్టుల జాబితాలో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానం ఢిల్లీకి ప్రయాణికుల సంఖ్యలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, సేవల వేగంలో శంషాబాద్ ముందంజలో ఉంది. ఏప్రిల్, మే నెలల్లోనే 54 లక్షల మంది ప్రయాణించారు. అంటే రోజుకు సగటున 90 వేల మంది రాకపోకలు జరిపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిస్ వరల్డ్ ప్రభావం ఏప్రిల్‌లో మిస్ వరల్డ్‌ సదస్సులు, మేలో పోటీలు జరగడం ద్వారా ప్రయాణికుల సంఖ్య ఎక్కువైంది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 3 కోట్లను తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ రాకపోకలు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల కారణంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎయిర్‌పోర్ట్ వృద్ధి దిశగా 2008లో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్ గత 15 ఏళ్లలో నాలుగు రెట్లు అభివృద్ధి చెందింది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రెండో రన్‌వే వినియోగంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad