L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మహారాష్ట్రలో వర్షాల విరుపు పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

మహారాష్ట్రలో వర్షాల విరుపు పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

మహారాష్ట్రలో వర్షాల విరుపు   పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

మహారాష్ట్రలో వర్షాలు విరుచుకుపడుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో రాయ్‌గఢ్‌, రత్నగిరి, సతారా, కొల్హాపూర్‌, పూణెలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ముంబైకి ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలిపోవడంతో రవాణా అంతరాయం కలిగింది. భద్రత దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthiheavy rains