A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

‘కూలీ’ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్‌కి రెడీ! లోకేష్ కనగరాజ్ మాటలకి విరుద్ధంగా ట్విస్ట్

‘కూలీ’ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్‌కి రెడీ! లోకేష్ కనగరాజ్ మాటలకి విరుద్ధంగా ట్విస్ట్

‘కూలీ’ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్‌కి రెడీ! లోకేష్ కనగరాజ్ మాటలకి విరుద్ధంగా ట్విస్ట్

రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ పిక్చర్స్ ఆగస్ట్ 2న ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల డైరెక్టర్ లోకేష్ ట్రైలర్ వదలమని అన్నారు కానీ ఇప్పుడు మేకర్స్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజు ‘వార్ 2’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్‌ వద్ద హై వోల్టేజ్ కాంపిటిషన్ ఖాయం. నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్‌లు

CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi