yakub
రచయిత
రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు! -నిధి అగర్వాల్
yakub
రచయిత
రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు! -నిధి అగర్వాల్

పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు, ప్రభాస్‌తో ది రాజాసాబ్ సినిమాల ద్వారా ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు నటి నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు జూలై 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిధి మాట్లాడుతూ – "తెలుగు ప్రేక్షకుల అభిమానానికి నేను ఫిదా అయ్యాను. సినిమాకు సంబంధించిన రూమర్లు మొదట చాలా వచ్చాయి, కానీ ట్రైలర్‌తోనే వాటికి చెక్ పెట్టాం. మనం పని చేస్తుంటే విమర్శలు రావడం సహజం. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి. మొదట విమర్శించినవారే చివరికి ప్రశంసిస్తారు" అంటూ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌పై ఆమె మాట్లాడుతూ – "పవన్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నికల సమయంలో కూడా షూటింగ్‌కు వచ్చారు. డైలాగ్స్, పాటలు, యాక్షన్ విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. పార్ట్-2లో కొన్ని సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేశాం" అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నిధి అగర్వాల్ సినిమాలపై, తనపై వస్తున్న రూమర్లకు ఘాటుగా స్పందించారు.