R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గుహలో జీవితం గడుపుతున్న రష్యా మహిళ – గోకర్ణలో సంచలనం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గుహలో జీవితం గడుపుతున్న రష్యా మహిళ – గోకర్ణలో సంచలనం

కర్ణాటకలోని గోకర్ణ రామతీర్థ కొండపై గుహలో నివసిస్తున్న రష్యా మహిళను పోలీసులు గుర్తించారు. నీనా కుటినా అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు – 6 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల అమాతో కలిసి గతకొంత కాలంగా అక్కడ నివసిస్తున్నారు. పర్యాటకుల భద్రత కోసం జూలై 9న గస్తీ నిర్వహించిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి వారిని సురక్షితంగా తరలించారు. ఆమెను ప్రశ్నించగా, ఆధ్యాత్మిక జీవితం కోసం గోవా నుంచి ఇక్కడకు వచ్చానని తెలిపింది. వీసా, పాస్‌పోర్టు ఆగుహలో పోయినట్లు చెప్పగా, అధికారులు అనంతరం వాటిని అక్కడే గుర్తించారు. ఆమె 2017లో వ్యాపార వీసాపై భారత్‌కు వచ్చి, నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తల్లి కూతుళ్లను కార్వార్ మహిళా రిసెప్షన్ సెంటర్‌కు తరలించగా, వీరిని రష్యాకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi