Lahari
రచయిత
రైళ్లలో సీసీటీవీలతో భద్రత కట్టుదిట్టం
Lahari
రచయిత
రైళ్లలో సీసీటీవీలతో భద్రత కట్టుదిట్టం

ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 74,000 ప్యాసింజర్ కోచ్‌లు, 15,000 సరుకు రవాణా లోకోమోటివ్‌లలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కెమెరాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా క్లియర్‌గా చిత్రాలను రికార్డ్ చేయగలవు. ప్రతి కోచ్‌లో ప్రయాణికుల కదలికలు ఎక్కువగా ఉండే ద్వారాల వద్ద 4 డోమ్ కెమెరాలు, లోకోమోటివ్‌లో 6 కెమెరాలు, డ్రైవర్ క్యాబిన్‌కి ప్రత్యేక మైక్రోఫోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు STQC సర్టిఫికేషన్‌తో ఉండి, తక్కువ వెలుతురు ఉన్నప్పటికీ నాణ్యమైన ఫుటేజ్ అందిస్తాయి. భవిష్యత్తులో ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా విశ్లేషించే ప్రణాళికను రైల్వే శాఖ రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టుతో నేరాలను తగ్గించి, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించవచ్చని అధికారులు చెబుతున్నారు.