R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మాజీ ప్రేయసి బర్త్‌డే పార్టీకి హాజరైన సల్మాన్‌ ఖాన్‌

మాజీ ప్రేయసి బర్త్‌డే పార్టీకి హాజరైన సల్మాన్‌ ఖాన్‌

మాజీ ప్రేయసి బర్త్‌డే పార్టీకి హాజరైన సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల తన మాజీ ప్రేయసి సంగీత బిజ్లానీ 65వ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. సల్మాన్‌ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ, జడ్ ప్లస్ భద్రతతో స్టైలిష్ లుక్‌లో పార్టీకి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్‌ ప్రస్తుతం "బ్యాటిల్ ఆఫ్ గల్వాన్‌" చిత్రంలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సల్మాన్ శక్తివంతమైన పాత్రలో కనిపించారు. గతంలో "సికందర్" సినిమాలో నటించిన సల్మాన్‌కు ఆ చిత్రం ఆశించిన విజయం అందించలేకపోయింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi