R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అతి పెద్ద కక్షిదారుగా ఎస్‌బీఐ: హైకోర్టు వ్యాఖ్యలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అతి పెద్ద కక్షిదారుగా ఎస్‌బీఐ: హైకోర్టు వ్యాఖ్యలు

చిన్న చిన్న వివాదాలను కూడా కోర్టులోకి లాగుతూ అతి పెద్ద కక్షిదారుగా వ్యవహరిస్తోందని ఎస్‌బీఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేయడానికి 542 రోజులు ఆలస్యం చేసినందుకు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా, అప్పీళ్లతో కాలయాపన చేస్తోందని మండిపడింది.రైతులు మాధవ రెడ్డి, ఎన్.బాలరెడ్డి కేసులో ట్రైబ్యునల్ ఇచ్చిన అనుకూల తీర్పును సవాలు చేస్తూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు తరఫు న్యాయవాది, పూర్వ న్యాయవాది అనారోగ్యం కారణంగా ఆలస్యం జరిగిందని వాదించగా, ధర్మాసనం కారణాలు స్పష్టంగా చూపకపోవడాన్ని తప్పుబట్టింది.విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

