R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అగ్నివీర్‌ల కోసం ఎస్బీఐ ప్రత్యేక లోన్ ఆఫర్ – ప్రాసెసింగ్ ఫీజు మాఫీ

అగ్నివీర్‌ల కోసం ఎస్బీఐ ప్రత్యేక లోన్ ఆఫర్ – ప్రాసెసింగ్ ఫీజు మాఫీ

అగ్నివీర్‌ల కోసం ఎస్బీఐ ప్రత్యేక లోన్ ఆఫర్ – ప్రాసెసింగ్ ఫీజు మాఫీ

భారత రక్షణ సేవల్లో సేవలందిస్తున్న అగ్నివీర్‌ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక పర్సనల్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఎస్బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న అగ్నివీర్‌లు కోలేటరల్ లేకుండానే రూ.4 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.ఈ లోన్‌పై వడ్డీ రేటు 10.50%గా నిర్ణయించబడింది. తిరిగి చెల్లింపు గడువు అగ్నిపథ్ సేవా కాలానికి అనుగుణంగా ఉంటుంది. ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి అంకితంగా పని చేస్తున్న అగ్నివీర్‌లకు ఇది చిన్న బహుమతిగా తీసుకొచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్ సిఎస్ సెట్టి తెలిపారు. భవిష్యత్తులో రక్షణ సిబ్బందిని గౌరవించే మరిన్ని ఆర్థిక పథకాలు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi