A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సీనియర్ నటి బీ. సరోజా దేవి కన్నుమూత
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సీనియర్ నటి బీ. సరోజా దేవి కన్నుమూత

ప్రముఖ సినీ నటి బీ. సరోజా దేవి (87) మృతి చెందారు. వృద్ధాప్యంతో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1938 జనవరి 7న జన్మించిన సరోజా దేవి, 1955లో ‘మహాకవి కాళిదాసు’ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. 1986లో భర్త మరణం తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, అనంతరం అభిమానుల ఒత్తిడితో మళ్లీ సినిమాల్లో నటించారు. 2019లో విడుదలైన ‘నటసార్వభౌమ’ ఆమె చివరి సినిమా. తెలుగు సినీ పరిశ్రమతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘పాండురంగ మహాత్యం’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా గుర్తింపు పొందారు.
ట్యాగ్‌లు
CinemaLatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news