R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుపతి - శిర్డీ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుపతి - శిర్డీ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభం

ప్రయాణికుల పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే తిరుపతి - సాయినగర్ శిర్డీ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సేవలు ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రైలు సమయాలు ఇలా ఉన్నాయి: తిరుపతి నుంచి (07637): ప్రతి ఆదివారం ఉదయం 4:00 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 10:45కి శిర్డీకి చేరుతుంది. శిర్డీ నుంచి తిరుపతి (07638): ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు బయలుదేరి, మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు తిరుపతి చేరుతుంది. ప్రధాన స్టేషన్లు: ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్, లింగంపల్లి, బీదర్, ఔరంగాబాద్, మన్మాడ్ సహా 30కిపైగా స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు లభ్యమవుతాయి.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi