Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రామ్‌చరణ్‌ అభిమానులకు క్షమాపణ తెలిపిన నిర్మాత శిరీష్‌

రామ్‌చరణ్‌ అభిమానులకు క్షమాపణ తెలిపిన నిర్మాత శిరీష్‌

రామ్‌చరణ్‌ అభిమానులకు క్షమాపణ తెలిపిన నిర్మాత శిరీష్‌

హీరో రామ్‌చరణ్‌ అభిమానులను నిరాశపరిచిన మాటలపై నిర్మాత శిరీష్‌ క్షమాపణలు చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంపై వచ్చిన వివాదంలో, తాను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదని ఆయన తెలిపారు. శిరీష్‌ వీడియో ద్వారా మాట్లాడుతూ, రామ్‌చరణ్‌, చిరంజీవి కుటుంబంతో తనకు గాఢమైన అనుబంధం ఉందని, అభిమానుల ఆవేదనను అర్థం చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. “తొలి ఇంటర్వ్యూలో మాట తడవడంతో తప్పుగా అర్థమైంది. చరణ్‌ను అవమానించే ఉద్దేశం లేదు,” అని వివరించారు. రామ్‌చరణ్‌తో మరో సినిమా ప్లాన్‌లో ఉందని చెప్పిన శిరీష్‌, “చరణ్‌ మంచి మనిషి, ఆయన సహకారంతోనే గతంలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి,” అని గుర్తు చేశారు. అభిమానులు దీనిని సానుకూలంగా తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్‌లు

CinemaKranthi NewsKranthi News Telugutelanganaramcharantollywoodproducer shirish