ramya
రచయిత
WHO నుంచి షేక్ హసీనా కుమార్తెకు షాక్: అవినీతి ఆరోపణలపై సైమా వాజెద్ సెలవుపై
ramya
రచయిత
WHO నుంచి షేక్ హసీనా కుమార్తెకు షాక్: అవినీతి ఆరోపణలపై సైమా వాజెద్ సెలవుపై

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె, డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిరవధిక సెలవుపై పంపింది. ఆమెపై మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ గతంలో ఆమెపై కేసు నమోదు చేయగా, దాదాపు నాలుగు నెలల తర్వాత జులై 11న WHO ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తాత్కాలిక ప్రాంతీయ డైరెక్టర్‌గా కేథరీనా బోహ్మే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో రాజకీయంగా ఉత్కంఠ నెలకొనగా, ఈ పరిణామం హసీనా కుటుంబానికి మరో దెబ్బగా మారింది. ఒకవైపు కోటా విధానం వ్యతిరేకంగా దేశంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు హసీనా భారతదేశంలో ఉంటుండగా, ఆమెను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో WHO తీసుకున్న తాజా చర్య అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది.