yakub
రచయిత
ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో షాక్ – ఫీజు పెంపుపై కోర్టు తిరస్కారం
yakub
రచయిత
ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో షాక్ – ఫీజు పెంపుపై కోర్టు తిరస్కారం

తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కోరిన ఫీజు పెంపునకు హైకోర్టు బ్రేక్ వేసింది. అధిక ఫీజులు వసూలు చేసేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఫీజుల పెంపు విషయంలో టీఏఎఫ్‌ఆర్‌సీ (TAFRC) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆరు వారాల్లో సిఫార్సులు తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని సూచించింది. చివరి నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. జీవో 26ను సవాల్ చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు తదితర 11 కాలేజీలు పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలేజీలు ప్రతీ సంవత్సరం ఇలా కోర్టును ఆశ్రయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. కాగా, TAFRC సమీక్ష ప్రక్రియలో ఆలస్యం కారణంగా 2025–26కు గత బ్లాక్ పీరియడ్ ఫీజులే కొనసాగుతాయని పేర్కొంది. మొత్తం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.