krtv
రచయిత
పాశమైలారం ప్రమాదం – వెలుగులోకి షాకింగ్ నిజాలు!
krtv
రచయిత
పాశమైలారం ప్రమాదం – వెలుగులోకి షాకింగ్ నిజాలు!

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో జూన్ 30న జరిగిన ఘోర రసాయన పేలుడు 40 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్న విషాదకర ఘటనగా నిలిచింది. సిగాచి ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులలో బీహార్, ఒడిశా, ఎపీ, తెలంగాణ కార్మికులు ఉన్నారు. FIR ప్రకారం, ఫ్యాక్టరీలో పాత మెషినరీ, తగిన భద్రతా ప్రమాణాల లేవని పోలీసులు పేర్కొన్నారు. రియాక్టర్ పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ మూడు అంతస్తుల భవనం కూలిపోవడంతో కార్మికులు దూరంగా ఎగిరిపడ్డారు. దాదాపు 35 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. DNA పరీక్షల ద్వారానే కొన్ని మృతదేహాలను గుర్తించే పరిస్థితి నెలకొంది. 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు రూ.1 కోటి, గాయపడిన వారికి సాయం ప్రకటించారు. ప్రధాని మోదీ PMNRF నుండి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.