R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అంతరిక్ష ప్రయాణం ముగిసిన శుభాన్షు శుక్లా బృందం – డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా తిరుగు ప్రయాణానికి సిద్ధం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా బృందం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. అమెరికా స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్ రూపొందించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారు భూమి వైపు ప్రయాణించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఫేర్‌వెల్ కార్యక్రమం జరగగా, మంగళవారం సాయంత్రానికి (అమెరికా సమయం ప్రకారం) డ్రాగన్ క్యాప్సూల్ కేలిఫోర్నియా తీరంలో దిగనుంది. ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్, స్లావోస్ ఉజన్‌స్కీ, తిబోర్ కాపు అనే ముగ్గురు అంతరిక్షయాత్రికులు ఈ మిషన్‌లో ఉన్నారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా రికార్డు సృష్టించాడు. భూమికి మళ్లీ చేరే క్షణాన్ని ఈ బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi