Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సంగారెడ్డి జిల్లా చేరియాల్‌గుట్ట వద్ద ఎస్‌ఐ దుర్మరణం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సంగారెడ్డి జిల్లా చేరియాల్‌గుట్ట వద్ద ఎస్‌ఐ దుర్మరణం

సంగారెడ్డిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రాజేశ్వర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి అతివేగంగా వచ్చిన లారీ, ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు పూర్తి చేసి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1990 బ్యాచ్‌కి చెందిన రాజేశ్వర్ గౌడ్ ఇటీవలే ఫిల్మ్‌నగర్‌లో ఎస్‌ఐగా చేరారు. కాగా, వారం రోజుల్లోనే ఈ విషాదం చోటు చేసుకోవడం తోటి పోలీసు సిబ్బందిని కలచివేసింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugucrime news