ritesh
రచయిత
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్ధం: హరిణ్య రెడ్డి ఎవరు?
ritesh
రచయిత
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్ధం: హరిణ్య రెడ్డి ఎవరు?

ప్రముఖ గాయకుడు, ఒస్కార్ అవార్డ్ విజేత రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్ధం చేసుకున్నారు. హైదరాబాద్లో ఆగస్ట్ 17న కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరగింది. రాహుల్ ప్రేమిస్తున్న యువతి హరిణ్య రెడ్డితో ఈ వేడుక జరిగినట్టు సమాచారం.ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, ఈ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హరిణ్య రెడ్డి ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా గూగుల్‌లో వెతుకుతున్నారు.ప్రస్తుతం హరిణ్య ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రైవేట్‌గా ఉన్నప్పటికీ, ఆమెను పలువురు టెలివిజన్, సినీ ప్రముఖులు ఫాలో అవుతుండటం ఆసక్తికరం. దీంతో ఆమె కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.రాహుల్ త్వరలోనే వివాహంపై స్పష్టత ఇవ్వనున్నారు అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.