ritesh
రచయిత
సింగూరు గేట్లు ఎత్తివేత – ఏడుపాయల అమ్మవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత
ritesh
రచయిత
సింగూరు గేట్లు ఎత్తివేత – ఏడుపాయల అమ్మవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు.ఇందునేల మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వరద ఉధృతి కారణంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పూజారులు, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆలయ రాజగోపురంలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. వరద తగ్గిన తర్వాత ఆలయాన్ని మళ్లీ భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.ప్రతి సంవత్సరం మంజీరా నదిలో వరదలు వచ్చినప్పుడు అలానే ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని పూజారులు తెలిపారు.