R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మద్యం కుంభకోణంలో జగన్‌ పాత్రపై సిట్‌ ఆరోపణలు

మద్యం కుంభకోణంలో జగన్‌ పాత్రపై సిట్‌ ఆరోపణలు

మద్యం కుంభకోణంలో జగన్‌ పాత్రపై సిట్‌ ఆరోపణలు

2019-24 మధ్య జరిగిన మద్యం కుంభకోణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలకంగా వ్యవహరించినట్టు సిట్ అనుబంధ ఛార్జిషీట్‌లో పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయాలు అక్రమ సంపాదనకు దారితీశాయని వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు విరుద్ధంగా చేసిన నియామకాలు, విధాన మార్పులు కుంభకోణానికి కారణమయ్యాయని పేర్కొంది.ఈ కేసులో కొత్తగా ముగ్గురు వ్యక్తులను (ఏ-31 నుంచి ఏ-33 వరకు) నిందితులుగా చేర్చింది. మొత్తం 10 మంది వ్యక్తులు, 9 సంస్థలపై కేసు నమోదు కాగా, తాజా అభియోగపత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలు, నకిలీ డైరెక్టర్ల వివరాలు ఉన్నాయి. ఈ కుంభకోణం విలువ రూ.3,500 కోట్లు కాగా, దీని వెనుక ఉన్న వ్యవస్థ ప్రణాళికాబద్ధమైందని సిట్ అభిప్రాయపడింది.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi