ritesh
రచయిత
తాళం మింగిన ఆరేళ్ల బాలిక – మూడు రోజుల్లో సురక్షితంగా బయటపడి ఊపిరి పీల్చిన తల్లిదండ్రులు
ritesh
రచయిత
తాళం మింగిన ఆరేళ్ల బాలిక – మూడు రోజుల్లో సురక్షితంగా బయటపడి ఊపిరి పీల్చిన తల్లిదండ్రులు

ఆడుకుంటున్న సమయంలో తాళాన్ని పొరపాటున మింగిన ఆరేళ్ల బాలిక ఓ అవాంఛిత అనుభవాన్ని ఎదుర్కొంది. అన్నతో ఆడుకుంటూ తాళాన్ని నోట్లో పెట్టుకున్న చిన్నారి దానిని గమనించకుండానే మింగేసింది. ఇది తల్లిదండ్రులకు తెలిసి డబ్బేస్తారనే భయంతో మొదట విషయాన్ని దాచింది.ఇంటికి వెళ్లాక డిన్నర్ సమయంలో అస్వస్థతకు గురైన బాలిక విషయం బయటపెట్టడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే పరీక్షల్లో తాళం కడుపులో ఉన్నట్లు గుర్తించగా, శస్త్రచికిత్సకు అవశ్యకత లేదని భావించిన వైద్యులు చిన్నారిని 72 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు.ఈ సమయంలో క్రమంగా తాళం శరీర గుండా ప్రయాణించి 72 గంటల తర్వాత సహజ మార్గంగా బయటకు వచ్చింది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చిన్నారి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈక్వెడార్‌లో చోటు చేసుకుంది.