K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు పొడిగింపు చర్లపల్లి–తిరుపతి

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు పొడిగింపు చర్లపల్లి–తిరుపతి

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు పొడిగింపు   చర్లపల్లి–తిరుపతి

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు పొడిగింపు ప్రకటించింది. చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం, తిరుపతి–చర్లపల్లి రైలు సెప్టెంబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం రాకపోకలు కొనసాగిస్తాయి. చర్లపల్లి రైలు రాత్రి 9:25కి బయలుదేరి, తదుపరి రోజు మధ్యాహ్నం 12:30కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి రైలు సాయంత్రం 4:40కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:00కి చర్లపల్లి చేరుతుంది. రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్‌, కంభం, గిద్దలూరు, నంద్యాల, కోయికంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్‌, యెర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, నందలూర్‌, రాజంపేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అడ్వాన్స్‌ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi