R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమలలో ఆగస్టులో విశేష పర్వదినాలు – టీటీడీ ప్రకటన
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమలలో ఆగస్టులో విశేష పర్వదినాలు – టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు ముఖ్యమైన పర్వదినాలు జరగనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 4న పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 8న ఆళ్వందార్ వర్ష తిరు నక్షత్రం, 9న శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ చేపట్టనున్నట్టు తెలిపారు. తదుపరి, ఆగస్టు 10న విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు, 16న గోకులాష్టమి ఆస్థానం, 17న శిక్యోత్సవం, 25న బలరామ జయంతి, వరాహ జయంతి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విశేష సందర్భాల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi