Lahari
రచయిత
శ్రీశాంత్ కేసు సుప్రీంకోర్టులో
Lahari
రచయిత
శ్రీశాంత్ కేసు సుప్రీంకోర్టులో

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల లలిత్ మోడీ విడుదల చేసిన “చెంపదెబ్బ” వీడియోతో వైరల్ అయిన ఆయన పేరు, ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుతో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే – ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్లకు యూనైటెడ్ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేయించింది. 2012లో శ్రీశాంత్ మోకాలికి గాయం కావడంతో, ఫ్రాంచైజీ రూ.82 లక్షల వైద్య ఖర్చు క్లెయిమ్ చేసింది. కానీ బీమా కంపెనీ – ఆయనకు 2011లోనే పాదం బొటన వేలు గాయం ఉందని, అది తెలపలేదని చెప్పి తిరస్కరించింది. ఈ వివాదంపై జాతీయ వినియోగదారుల కమిషన్ రాజస్థాన్ రాయల్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, బీమా కంపెనీ డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. దాంతో ఇన్షూరెన్స్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం – శ్రీశాంత్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, గాయాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సూచించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే తుది తీర్పు వెలువడనుంది.

