R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీటి ఆవర్తనం పెరగడంతో అధికారులు 8 గేట్లు ఎత్తి 2.16 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి ప్రాజెక్టుకు 2.93 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 882.80 అడుగులుగా ఉండగా, నిల్వ 203.40 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,972 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 10 గేట్లు ఎత్తి 16,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌ నుంచి పులిచింతలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతలలో 2.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2.51 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi