L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత – సాగర్ వైపు కృష్ణమ్మ ప్రవాహం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత – సాగర్ వైపు కృష్ణమ్మ ప్రవాహం

శ్రీశైలం డ్యామ్‌లో గేట్లు ఎత్తడంతో కృష్ణా నది ఉప్పొంగుతోంది. ప్రాజెక్టు వద్ద 6, 7, 8, 11వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్యామ్‌ను సందర్శించి కృష్ణమ్మకు పూజలు చేశారు. అంతకుముందు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎగువ ప్రాంతాల వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882 అడుగుల నీటినిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv kranthi