R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా.. రెండుగేట్ల ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా.. రెండుగేట్ల ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా..  రెండుగేట్ల ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

శ్రీశైలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, 54,590 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్ల ద్వారా 20,590 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,545 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 43,790 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 79,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్‌ దిశగా 66,810 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. అలాగే, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1,598 క్యూసెక్కులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 1,300 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 24,166 క్యూసెక్కుల నీరు పంపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 883.10 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. అలాగే, నీటి నిల్వ 205.22 టీఎంసీలుగా ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi