ritesh
రచయిత
స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది – నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
ritesh
రచయిత
స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది – నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల అనంతరం మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకోవడం వలన మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. సెన్సెక్స్ 317.45 పాయింట్లు పెరిగి 82,570.91 వద్ద ముగియగా, నిఫ్టీ 113.50 పాయింట్ల లాభంతో 25,195.80 వద్ద స్థిరమైంది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠంగా 82,743.62 పాయింట్లను తాకింది. ఆటో, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా వంటి కంపెనీలు లాభాల్లో నిలవగా, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కొంత నష్టపోయాయి. రూపాయి విలువ డాలరుతో 85.82గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 68.99 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 3,374 డాలర్ల వద్ద కొనసాగుతోంది.