K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బాల కార్మిక నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటాం – రాచకొండ సీపీ సుధీర్ బాబు| kranthinews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బాల కార్మిక నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటాం – రాచకొండ సీపీ సుధీర్ బాబు| kranthinews

రాచకొండ:బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు స్పష్టం చేశారు. నేరదేమెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఆపరేషన్ ముస్కాన్-XI సమావేశంలో ఆయన మాట్లాడారు.పిల్లల బాల్యాన్ని నాశనం చేసే బాల కార్మిక వ్యవస్థను సమాజం నుంచి తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదరికం వల్ల బాలలు నేరశృంఖలలోకి వెళ్తున్నారన్న ఆయన, ప్రభుత్వ పథకాలను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని సూచించారు.మానవ అక్రమ రవాణా, బాల కార్మిక నిర్మూలనపై ప్రత్యేక బృందాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వలస కార్మికుల పిల్లల కోసం వర్క్‌సైట్ పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య, విద్యా శాఖల అధికారులు, NGO ప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv newstelangana