ritesh
రచయిత
జెన్-Z ఉద్యోగులకు సుందర్ పిచాయ్ ప్రేరణాత్మక సూచనలు
ritesh
రచయిత
జెన్-Z ఉద్యోగులకు సుందర్ పిచాయ్ ప్రేరణాత్మక సూచనలు

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన అనుభవాలను పంచుకుంటూ జెన్-Z యువ ఉద్యోగులకు ఉపయోగకరమైన సూచనలు చేశారు. ఇటీవల అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, అవకాశాలపై పిచాయ్ మాట్లాడారు.తన కన్నా మెరుగైన ప్రతిభావంతులైనవారితో పని చేసిన అనుభవాలు తన అభివృద్ధికి దోహదపడ్డాయని తెలిపారు. "ప్రతిభ గలవారితో కలిసి పనిచేయడం వల్ల మీరు నేర్చుకునే అంశాలు ఎక్కువ. ఇది మీ సామర్థ్యాన్ని విస్తరించడానికి అవకాశంగా మారుతుంది. మీరు అసౌకర్యంగా భావించిన సందర్భాలు కూడా మీ ఎదుగుదలకు దోహదపడతాయి" అన్నారు.యువ ఉద్యోగులు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని, ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిచాయ్ సూచించారు. సవాళ్లు ఎదురయ్యే సందర్భాల్లోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఇదే ధోరణి గూగుల్ సీఈఓగా తన ఎంపికకు దారితీసిందని వెల్లడించారు.