ramya
రచయిత
చిన్నారి కస్టడీ కేసులో సుప్రీంకోర్టు సీరియస్
ramya
రచయిత
చిన్నారి కస్టడీ కేసులో సుప్రీంకోర్టు సీరియస్

రష్యాకు చెందిన మహిళ తన బిడ్డను అక్రమంగా దేశం బయటకు తీసుకెళ్లిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తల్లిదండ్రుల మధ్య కస్టడీ వివాదం న్యాయపరంగా కొనసాగుతున్న తరుణంలో, తమ అనుమతి లేకుండా చిన్నారిని దేశం దాటి తీసుకెళ్లడం న్యాయ ప్రక్రియను ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. భర్త ఫిర్యాదుపై వెంటనే స్పందించకపోయిన దిల్లీ పోలీసులపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. చిన్నారి ఉన్న స్థలాన్ని గుర్తించేందుకు ఇంటర్‌పోల్ సహాయం తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రష్యన్ ఎంబసీ సహకారంతో ఆమె దేశం దాటిందని భావిస్తున్నారు. పాస్‌పోర్టు సీజ్ అయినప్పటికీ, డూప్లికేట్ పాస్‌పోర్టుతో ఆమె షార్జా మార్గంగా రష్యా వెళ్లినట్లు కేంద్రం కోర్టులో తెలిపింది. ఇది కోర్టు ధిక్కారానికి తలపెట్టిన చర్యగా పేర్కొంటూ, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.