A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఢిల్లీ లాజ్‌పత్ నగర్‌లో తల్లీకొడుకుల హత్య కలకలం

ఢిల్లీ లాజ్‌పత్ నగర్‌లో తల్లీకొడుకుల హత్య కలకలం

ఢిల్లీ లాజ్‌పత్ నగర్‌లో తల్లీకొడుకుల హత్య కలకలం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ ప్రాంతంలో జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఓ ఇంట్లో పని చేసేవాడు, యజమానురాలైన 42ఏళ్ల మహిళ మరియు ఆమె 14ఏళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేశాడు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిపై తిట్టిన విషయం తరచుగా ఉద్రిక్తతకు దారి తీసినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగా మహిళ మంచం పక్కన, కుమారుడు బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. అనుమానితుడిని ముకేశ్ (24) అనే వ్యక్తిగా గుర్తించి, పాలాయన ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నాయి. పోలీసులు కేసును విచారిస్తున్నారు.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv kranthitrending newscrime news