L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కర్ణాటకలో జీఎస్టీ వ్యతిరేకంగా టీ, కాఫీ, పాల విక్రయాల బంద్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కర్ణాటకలో జీఎస్టీ వ్యతిరేకంగా టీ, కాఫీ, పాల విక్రయాల బంద్

కర్ణాటకలో జీఎస్టీ నోటీసులపై నిరసనగా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు టీ, కాఫీ, పాల విక్రయాలు నిలిపివేశారు. డిజిటల్ లావాదేవీలపై భారీగా పన్నులు విధించడం పట్ల ఆగ్రహంతో వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 2021-22 నుండి 2024-25 వరకు UPI లావాదేవీల ఆధారంగా జీఎస్టీ నోటీసులు జారీ కావడం వ్యాపారులను ఆందోళనకు గురి చేసింది. లక్షల్లో పన్ను చెల్లించాల్సి వస్తుందనే భయంతో అనేక మంది 'నగదు లావాదేవీలకే' మళ్లారు. జూలై 25న రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించనున్నట్లు వ్యాపార సంఘాలు హెచ్చరించాయి. ఈ అంశంపై సీఎం సిద్ధరామయ్య వ్యాపార ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే, నిరసనలు ముదిరే అవకాశముందని వ్యాపారులు స్పష్టం చేశారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihealth