R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

డ్యూటీలో మద్యం సేవించిన టీచర్ సస్పెన్షన్‌కి గురైయ్యారు

డ్యూటీలో మద్యం సేవించిన టీచర్ సస్పెన్షన్‌కి గురైయ్యారు

డ్యూటీలో మద్యం సేవించిన టీచర్ సస్పెన్షన్‌కి గురైయ్యారు

గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు రవిచందర్ మద్యం తాగి పాఠశాలకు హాజరవడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మంగళవారం మద్యం మత్తులో స్కూల్‌కు వచ్చిన అతడిని గమనించిన గ్రామస్తులు ప్రశ్నించగా, అధికారులు తనను అర్థం చేసుకోలేరని, ఎవరూ తాను చేసిన పని మీద చర్యలు తీసుకోలేరంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.ఆ సమయంలో స్కూల్ కాంపౌండ్‌లో చెత్తకుప్పపై పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గద్వాల కలెక్టర్ గమనించి, బుధవారం రవిచందర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ చర్యపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ ఇచ్చే స్థలంలోనే ఇలాంటి ప్రవర్తనను సహించలేమని వారు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi