krtv
రచయిత
తెలంగాణ బీజేపీకి కొత్త కెప్టెన్..బీజేపీ వ్యూహంలో కీలక మలుపు! | kranthi news
krtv
రచయిత
తెలంగాణ బీజేపీకి కొత్త కెప్టెన్..బీజేపీ వ్యూహంలో కీలక మలుపు! | kranthi news

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రాంచందర్ రావు ఎంపిక వెనుక వ్యూహం ఏమిటి? - ఈసారి కమల దళం టార్గెట్ కొత్త దిశగా..! తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై తెరలేపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా, ఎన్. రాంచందర్ రావును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమించబోతున్నట్లు సమాచారం. పార్టీలో ఈ పదవికి పోటీ పడ్డవారిలో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ వంటి బీసీ సామాజికవర్గ నాయకుల పేర్లు వినిపించినా, అధిష్ఠానం రాంచందర్‌వైపు మొగ్గు చూపింది. ఇంతకీ, రాంచందర్ రావు ఎంపిక వెనుక రహస్యమేంటంటే – ఆయన మొదటి నుంచీ పార్టీతోనే ఉంటూ, విశ్వసనీయంగా పని చేశారు. విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, బీజేవైఎం, లీగల్ సెల్ వంటి విభాగాల్లోనూ సేవలందించారు. బీజేపీ న్యాయవాద విభాగంలో పేరుగాంచిన ఆయనకు, హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవమూ ఉంది. వివాదాలకు దూరంగా ఉండే, అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగించే రాంచందర్ రావును ఎంపిక చేయడం ద్వారా పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. తాజా రాజకీయ పరిస్థితుల్లో, దూకుడు నాయకత్వం కంటే సమన్వయాన్ని ప్రోత్సహించే నాయకత్వం అవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ, మొదటి నుంచీ బీజేపీతో ఉన్న నేత మాధవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాంచందర్ రావు ఎంపిక వెనుక, ఆయన్ని బీజేపీ అంతర్గతంగా నమ్మకం కలిగిన నాయకుడిగా పరిగణించడం, కార్యకర్తలతో దగ్గర సంబంధం, పరిపక్వత ఉన్న ప్రస్థానం వంటి అంశాలే కీలకం అయ్యాయని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో బీజేపీ తెలంగాణలో తేడాలు కనిపించగా, ఒకరికొకరు విమర్శలు చేసుకునే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అలాంటి దశలో అందరినీ కలుపుకునే నాయకునిగా రాంచందర్ రావు సరైన ఎంపిక అవుతారన్నది పార్టీ అగ్రనాయకుల అభిప్రాయం. ఎంపికపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, రాంచందర్ తన పనితీరు ద్వారా వాటికి సమాధానం ఇస్తారని ఆయన అనుచరులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2029 ఎన్నికల వరకు కమల దళం బలంగా ముందుకెళ్లే రణనీతికి ఇది కీలకమై మార్పుగా చెబుతున్నారు విశ్లేషకులు.