A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాయదుర్గంలో ఎకరా రూ.104 కోట్లు.. తెలంగాణ ప్రభుత్వం భూముల వేలానికి సిద్ధం!
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాయదుర్గంలో ఎకరా రూ.104 కోట్లు.. తెలంగాణ ప్రభుత్వం భూముల వేలానికి సిద్ధం!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 66 ఎకరాల భూములను టీజీఐఐసీ ద్వారా వేలం వేయేందుకు సిద్ధమవుతోంది. రాయదుర్గం, ఉస్మాన్ సాగర్ ప్రాంతాల్లో ఉన్న ఈ భూముల్లో రాయదుర్గంలోని కొన్ని ప్లాట్ల ధర ఎకరానికి రూ.104 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. ఇది గతంలో కోకాపేట్‌లో నమోదైన ధరను మించనుంది. ఈ వేలానికి సంబంధించిన టెండర్ దాఖలుకు చివరి తేది ఆగస్టు 8 కాగా, టెండర్ ఫలితాలను ఆగస్టు 12న ప్రకటించనున్నారు. 17 ప్లాట్లలో 4 రాయదుర్గంలో, 13 ఉస్మాన్ సాగర్‌లో ఉన్నాయి. రాయదుర్గంలోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్ల ధర చదరపు గజానికి రూ.2.16 లక్షలు కాగా, అప్‌సెట్ ప్రైస్ రూ.1.51 లక్షలు ఉంది. మొత్తం రాయదుర్గంలో 19.67 ఎకరాలు, ఉస్మాన్ సాగర్‌లో 46.33 ఎకరాల భూమి వేలానికి సిద్ధంగా ఉంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana