Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణ వాహనదారులకు అలర్ట్ పెండింగ్ చలాన్లు ఉంటే లైసెన్స్ సస్పెన్షన్..!
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణ వాహనదారులకు అలర్ట్ పెండింగ్ చలాన్లు ఉంటే లైసెన్స్ సస్పెన్షన్..!

తెలంగాణలో మూడు నెలలకుపైగా ట్రాఫిక్ చలాన్లు బకాయిలుగా ఉన్నవాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు కావచ్చని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ వంటివి చేసిన 18,000 మందికి పైగా లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్నవారిపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెండింగ్ ఫైన్ల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడమే కాక, రోడ్డు భద్రతకూ ముప్పు ఏర్పడుతోంది. జరిమానాలను ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana