R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు సిద్దం

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు సిద్దం

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు సిద్దం

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో ప్రాజెక్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం రేపు (శుక్రవారం) టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారిక సమాచారం. మొత్తం రూ.21,616 కోట్ల వ్యయంతో ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందులో విశాఖ మెట్రోకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.10,118 కోట్లు కేటాయించనున్నారు. ప్రాథమికంగా 40 శాతం పనుల కోసం మొదటి దశలో టెండర్లు పిలవనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో (50:50) కొనసాగనుంది. విశాఖ మెట్రో కోసం వీఎంఆర్డీఏ రూ.4,101 కోట్లు, విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ రూ.3,497 కోట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi