ritesh
రచయిత
తెలంగాణలో కుండపోత వర్షాలు – రెడ్ అలర్ట్ జారీ
ritesh
రచయిత
తెలంగాణలో కుండపోత వర్షాలు – రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలో 21.8 సెం.మీ. వర్షపాతం నమోదవగా, సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెం.మీ. వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధానికి గురై ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 40కు పైగా కాలనీలు నీట మునిగాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.రానున్న 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం యాదాద్రి భువనగిరి, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో, గురువారం వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవొచ్చని హెచ్చరించింది.