Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఉగ్రవాద అనుమానిత షామా పర్వీన్ బెంగళూరులో అరెస్టు

ఉగ్రవాద అనుమానిత షామా పర్వీన్ బెంగళూరులో అరెస్టు

ఉగ్రవాద అనుమానిత షామా పర్వీన్ బెంగళూరులో అరెస్టు

అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న ఉగ్ర గ్రూప్‌కు కీలకంగా వ్యవహరిస్తోందని భావిస్తున్న షామా పర్వీన్ అనే మహిళను గుజరాత్ ఏటీఎస్ అధికారులు బెంగళూరులో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఆమెను విచారణ కోసం అహ్మదాబాద్‌కి తరలించారు. జులై 23న దేశవ్యాప్తంగా ఇతర నలుగురిని కూడా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ సభ్యులు ఒక రహస్య సోషల్ మీడియా యాప్‌ ద్వారా పరస్పరం సమాచారాన్ని పంచుకుంటున్నట్లు గుర్తించారు. షామా పర్వీన్ హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో నివసించినట్టు, సమాజంలో యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi