ashok
రచయిత
జూలై 15న భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం!
ashok
రచయిత
జూలై 15న భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, ఎట్టకేలకు భారత్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. జూలై 15న ముంబై జియో వరల్డ్‌లో తొలి షోరూం అధికారికంగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా వై మోడల్ కార్లు చైనా షాంఘై ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ షోరూం కోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో 4,000 చదరపు అడుగుల ప్రాంగణాన్ని టెస్లా లీజ్‌కు తీసుకుంది. నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్న ఈ ప్రాపర్టీ, యాపిల్ స్టోర్‌కు సరిసమీపంలో ఉంది. ముందుగా ముంబైలో ప్రారంభించి, డిమాండ్‌ను బట్టి ఢిల్లీలోనూ షోరూమ్ ఏర్పాటు చేయాలన్న యోచనలో టెస్లా ఉంది. గతంలో దిగుమతి సుంకాల సమస్యలు ఎదురైనా, ప్రధాని మోదీ–ఎలాన్ మస్క్ భేటీ తర్వాత పరిణామాలు మారాయి. ప్రస్తుతం టెస్లా వై మోడల్ కార్ల ధర (పన్నులు, బీమా కలుపుకొని) రూ.48 లక్షలు పైగా ఉండనుంది. టెస్లా ప్రవేశంతో భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.