R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భారత్‌లో టెస్లా తొలి షోరూమ్‌కు శ్రీకారం – జులై 15న ముంబైలో ప్రారంభం

భారత్‌లో టెస్లా తొలి షోరూమ్‌కు శ్రీకారం – జులై 15న ముంబైలో ప్రారంభం

భారత్‌లో టెస్లా తొలి షోరూమ్‌కు శ్రీకారం – జులై 15న ముంబైలో ప్రారంభం

ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే జులై 15న ముంబై జియో వరల్డ్‌ మాల్‌లో తొలి షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించనుంది. ఇప్పటికే చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి టెస్లా వై మోడల్ కార్లను భారత్‌కు తెప్పించినట్లు సమాచారం. ఈ షోరూమ్ కోసం టెస్లా సంస్థ ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. నెలకు రూ. 35 లక్షల అద్దె చెల్లించనుండగా, రూ. 2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ ఇచ్చినట్టు సమాచారం. అద్దె ఒప్పందం ఐదేళ్లపాటు కొనసాగనుంది. ఇదే తరుణంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికాలో జరిగిన భేటీ కీలకమైనదిగా భావిస్తున్నారు. వాణిజ్య అంశాలపై జరిగిన చర్చల్లో టెస్లా భారత్‌లో విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడింది. చైనా, యూరప్ దేశాల్లో అమ్మకాలు తగ్గడంతో, ఇప్పుడు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న టెస్లా… మొదట ముంబైలో, తర్వాత ఢిల్లీ వంటీ ప్రధాన నగరాల్లో షోరూం‌లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. టెస్లా వై మోడల్ ధర సుమారు రూ. 48 లక్షలు (పన్నులు, బీమా సహా)గా ఉండనుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi