ritesh
రచయిత
సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదం – డ్రైవర్ సురక్షితం
ritesh
రచయిత
సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదం – డ్రైవర్ సురక్షితం

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు వద్ద ఆగస్ట్ 15న మధ్యాహ్నం ఒక కారు ప్రమాదవశాత్తూ సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే... నేరేడుచర్ల నుంచి కల్లూరు వైపు వెళ్తున్న కారు, వేగంగా దూసుకెళ్తుండగా డ్రైవర్‌కు కంట్రోల్ తప్పింది. దీంతో కారు రోడ్డునుంచి దూకి కాలువలో పడిపోయింది.అయితే అదృష్టవశాత్తూ డ్రైవర్ కారు నుంచి ఈదుకుంటూ బయటపడ్డాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చి సహాయం కోరాడు. స్థానిక ఈతగాళ్లు, గ్రామస్తులు కలిసి కాలువలోకి దిగి కారును తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చారు.ఈ ప్రమాదం తీవ్రతరం అయినా, డ్రైవర్ ఒక్కరే ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా తప్పించుకోవడం ఊపిరి పీల్చేలా చేసింది.ప్రమాదం ఎలా జరిగిందో, వేగం ఎంతగా ఉన్నదో అనేక ప్రశ్నలు locals మద్య చర్చకు వస్తున్నాయి. అధికారులు ఘటనపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు.