L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 5 మంది మృతి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 5 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 20 మంది గాయపడారు. సర్కాఘాట్ నుంచి దుర్గాపూర్ వెళ్తున్న HRTC బస్సు 25 మీటర్ల లోతుగల లోయలోకి పడిపోయింది. ఘటనకు సంబంధించి మండి ఎస్పీ సాక్షీ వర్మ స్పందిస్తూ, బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడినవారిని బిలాస్‌పూర్ ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi