R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కిరణ్ అబ్బవరం-రహస్య దంపతుల తొలి వివాహ వార్షికోత్సవం.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్

కిరణ్ అబ్బవరం-రహస్య దంపతుల తొలి వివాహ వార్షికోత్సవం.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్

కిరణ్ అబ్బవరం-రహస్య దంపతుల  తొలి వివాహ వార్షికోత్సవం.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ మూవీ సక్సెస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఆయన ‘K-Ramp’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండగా, రిలీజ్ అయిన ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పంచకట్టులో మాస్ లుక్‌తో ఆకట్టుకున్నప్పటికీ, కొన్ని డైలాగ్స్‌పై విమర్శలు వచ్చాయి. అయినా కూడా కిరణ్ ఫన్ స్టైల్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 18, 2025న విడుదల కానుంది. వ్యక్తిగతంగా కూడా కిరణ్ సంతోషంగా ఉన్నారు. ఆయన-రహస్య దంపతులు 2024 ఆగస్టు 22న పెళ్లి చేసుకోగా, 2025 మేలో హనూ అబ్బవరం అనే పాపాయికి తల్లిదండ్రులు అయ్యారు. నేడు ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కిరణ్ షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి హనూ క్యూట్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi