ashok
రచయిత
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు చివరి తేదీ జూలై 31!
ashok
రచయిత
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు చివరి తేదీ జూలై 31!

ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం రెండో విడత బుకింగ్ జూలై 31తో ముగియనుంది. ఇంకా బుక్ చేయని లబ్ధిదారులు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు తర్వాత అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెండో సిలిండర్‌ను 93.46 లక్షల మంది తీసుకోగా, రూ.747 కోట్లు సబ్సిడీగా జమైంది. కానీ, 86 వేల మందికి బ్యాంక్ అకౌంట్ సమస్యలతో డబ్బులు చేరలేదు. దీనికి సచివాలయ సిబ్బంది సహాయం చేస్తున్నారు. మూడో సిలిండర్ బుకింగ్ ఆగస్టు 1 నుంచి నవంబర్ 30లోపు చేయాలి. ఈసారి ప్రభుత్వం వ్యాలెట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,281 మందిని ఎంపిక చేసి, సిలిండర్ కొనుగోలుకు మాత్రమే వాడే డిజిటల్ వాలెట్‌ను పరీక్షిస్తున్నారు. సబ్సిడీ లేనివారు తమ ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.