L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె, పలు సేవలకు అంతరాయం అవకాశం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె, పలు సేవలకు అంతరాయం అవకాశం

జూలై 9 (బుధవారం) నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సుమారు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకులు, బీమా, బొగ్గు గనులు, రవాణా, నిర్మాణ రంగాల్లో కార్యకలాపాలు నిలిచే అవకాశం ఉంది. పదికి పైగా ట్రేడ్ యూనియన్లు ఈ బంద్‌లో భాగమవుతుండగా, రైతులు, గ్రామీణ కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు. గతంలో సమర్పించిన డిమాండ్లపై స్పందన లేకపోవడంతో ఈ బంద్ చేపడుతున్నట్లు యూనియన్లు స్పష్టం చేశాయి. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బలగాలను మోహరించారు. స్కూళ్లు, ఆర్టీసీ బస్సులపై ప్రభావం స్థానిక పాలన ఆధారంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi