A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్ 'హైప్' – చిన్న క్రియేటర్లకు పెద్ద అవకాశం!

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్ 'హైప్' – చిన్న క్రియేటర్లకు పెద్ద అవకాశం!

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్ 'హైప్' – చిన్న క్రియేటర్లకు పెద్ద అవకాశం!

భారతదేశంలో యూట్యూబ్ తాజాగా 'హైప్' అనే ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది 500 నుంచి 5 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్న చిన్న, మధ్య స్థాయి కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేకంగా రూపొందించబడింది. వీడియో పబ్లిష్ అయిన తొలి 7 రోజుల్లో వీక్షకులు 'హైప్' బటన్ ద్వారా తమ మద్దతును చూపించవచ్చు. హైప్ ఎలా పనిచేస్తుంది? హైప్ చేసిన వీడియోలకు పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్ల ఆధారంగా వీడియోలు ‘టాప్ 100 హైప్ వీడియోల’ లీడర్‌బోర్డ్‌లో ప్రదర్శించబడతాయి. తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానెల్స్‌కు ఎక్కువ బోనస్ పాయింట్లు లభించాయి. ప్రయోజనాలు: ఛానెల్‌కు కొత్త వీక్షకులు చేరే అవకాశం హైప్ వీడియోలు హోమ్ పేజ్‌లో కనిపించే అవకాశం వీక్షకుల మద్దతు, డేటా ద్వారా క్రియేటర్‌కు కంటెంట్ ఇన్‌సైట్స్ వీడియోలు బ్యాడ్జ్‌లు పొందే అవకాశం ఎంగేజ్‌మెంట్, ఆదాయంలో పెరుగుదల ఈ ఫీచర్‌తో చిన్న యూట్యూబ్ సృష్టికర్తలు తమ ఛానెల్‌ను వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం పొందనున్నారు.

ట్యాగ్‌లు

Kranthi Newskrtv newskrtv kranthitrending newstech